PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీపై కత్తితో దాడి.. దారుణ హ‌త్య

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బ్రిట‌న్ ఎంపీ దారుణ హ‌త్యకు గురయ్యారు. వెసెక్స్ లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎంపీ డేవిడ్ ఓ చ‌ర్చిలో స్థానికుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ క్రమంలో ఆయ‌న పై ఓ వ్యక్తి క‌త్తితో దాడి చేసి… ప‌లుమార్లు పొడిచాడు. తీవ్రగాయాలైన ఆయ‌న‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ డేవిడ్ అమీస్ మృతిచెందారు. స్థానిక పోలీసులు ఈ విష‌యాన్ని వెల్లడించారు. ఈ కేసులో దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. డేవిడ్ అమీస్ మృతిపై ప‌లువురు ప్రజాప్రతినిధులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

About Author