బుల్ జోరుకు బ్రేక్.. ఆవిరైన లాభాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు… మధ్యాహ్న సమయంలో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 62 వేల మైలురాయిని దాటి జీవనకాల గరిష్ఠాన్ని చేరుకుంది. అయితే కొద్దిసేపటికే సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 61,716 వద్ద ముగిసింది. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,418 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 39,540 వద్ద ముగిసింది.