చిప్పగిరి గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు ని పరామర్శించిన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చెరువు తిమ్మప్ప గత కొన్ని రోజుల క్రితం కంటి గాయానికి గురై కర్నూలు నగరంలోని మంజుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి , వారి సతీమణి బుసినే రామాంజినమ్మ ఆసుపత్రికి వెళ్లి చెరువు తిమ్మప్ప ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.అదేవిధంగా ఆసుపత్రి వైద్యులను కలిసి చెరువు తిమ్మప్ప కి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు మొల్లగవెల్లి రామాంజినేయులు , వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

