విధ్వంసానికి నిరసనగా.. నేడు ఏపీ బంద్
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం కార్యాలయాలపై, నాయకులపై దాడుల నేపథ్యంలో ఏపీ బంద్ కు తెలుగు దేశం పార్టీ పిలుపునిచ్చింది. బుధవారం రోజున ఏపీ బంద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంగళగిరి, విశాఖ, చిత్తూరు, నెల్లూరులో టీడీపీ కార్యాలయాపై దాడులు జరిగాయి. నాయకులపైన కూడ దాడి జరిగింది. టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంటిలోని సామాగ్రి మొత్తం ధ్వంసం చేశారు.