డీజీపీలో మార్పు రావాలి : సోము వీర్రాజు
1 min readపల్లెవెలుగు వెబ్ : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇలాంటి అనైతిక ఘటనలను భాజాపా ఖండిస్తుందని చెప్పారు. రాజకీయపార్టీలు మాట్లాడే భాష విషయంలో కూడ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. టీడీపీ చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు కానీ.. వైకాపా దాడులపై స్పందించలేదని అన్నారు. ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పురావాలని అన్నారు. కడపలో విజయదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.