ఎమ్మెల్యే ఆదేశాలతో.. వాల్మీకి నగర్లో బోరు ఏర్పాటు..
1 min readపల్లెవెలుగు వెబ్, ఆదోని: ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ పట్టణాధ్యక్షుడు దేవా నేతృత్వంలో బోరు ఏర్పాటు చేశారు. కాలనీలో నీటి సమస్య ఉందని, వేసవి సమీపిస్తున్న క్రమంలో బోరు వేయించాలని వాల్మికినగర్ ప్రజలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గతంలో కోరారు. అప్పట్లో బోరు వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మంగళవారం వాల్మీకినగర్లో బోరు ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింలు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా పూజ చేసి బోర్ స్టార్ట్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుధాకర్ , మల్లి, పూలతోట రాముడు, రాజు , రామకృష్ణ , వెంకటేష్, షరీఫ్, భవాని, ప్రతాపు, యువరాజ్, రఘు తదితరులు పాల్గొన్నారు.