మంత్రి నుంచి ఆ శాఖ తొలగించారు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీ మంత్రి నుంచి ఓ శాఖను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఎక్సైజ్,వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తొలగించింది. వాణిజ్య పన్నుల శాఖను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలను ఇప్పటి వరకు బుగ్గన చూస్తుండగా.. ఇక నుంచి వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతను ఆయనే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.