ఎమ్మెల్యేలు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలి !
1 min readపల్లెవెలుగు వెబ్: తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరుస సంచలన నిర్ణయాలతో సీఎం స్టాలిన్ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. శాసనసభ ఆవరణలో భోజనశాల మూసివేయాలని ఆదేశించారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు వారి ఇంటి నుంచే భోజనాలు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు చర్చించే సమయంలో తనను పొగిడి సమయం వృథా చేస్తే చర్యలు తీసుకుంటానని ఇటీవలే హెచ్చరించారు. తన కాన్వాయ్ వల్ల ప్రజారవాణాకు ఇబ్బందులు తలెత్తకూడదని కాన్వాయ్ లో కార్ల సంఖ్య తగ్గించారు. అమ్మ క్యాంటీన్లను తొలగించారు. వరుస నిర్ణయాలతో ఆయన పై ప్రసంశల వర్షం కురుస్తోంది.