కొరడా దెబ్బలు తిన్న సీఎం: కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆయన రాష్ట్రానికి అధిపతి. పనులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. అయితే అనాధిగా వస్తున్న వింత ఆచారాన్ని ఆయన కూడా పాటించారు. ఇంతకీ ఆయన ఎవరూ?.. ఆ ఆచారం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఛత్తీస్‌గడ్.. బాగా వెనుకబడిన రాష్ట్రం. యేటా దీపావళి తరువాత అక్కడ గోవులకు గోవర్ధన పూజ చేయడం అనవాయితీగా వస్తోంది. ఈ పూజలో కొరడా దెబ్బలు తినడం అనాదిగా పాటిస్తున్నారు గిరిజనులు. సాక్షాత్తు సీఎం కూడా కొరడా దెబ్బలు తిన్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దుర్గ్ జిల్లాలోని జజన్ గిరి అనే గ్రామంలో గోవర్ధన పూజ సందర్భంగా సీఎం భూపేశ్ భగేల్ కూడా హాజరయ్యారు. గోవర్ధన పూజలో పాల్గొన్న ఆయన ఆ వింత ఆచారాన్ని పాటించారు. కొరడాతో 8 పర్యాయాలు కొట్టించుకున్నారు. కొరడా దెబ్బలు తింటే దేవుడి ఆశీస్సులు లభిస్తాయని సీఎం భగేల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల క్షేమం కొరడా దెబ్బలు తిన్నానని తెలిపారు.