PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పునీత్ లేడంటే న‌మ్మలేక‌పోతున్నాం

1 min read

పల్లెవెలుగు వెబ్ :పునీత్ రాజ్ కుమార్ లేడంటే న‌మ్మలేక‌పోతున్నామ‌ని ప్రముఖ హీరో, పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు శివ‌రాజ్ కుమార్ అన్నారు. పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ 11 రోజుల పుణ్యతిథిని కుటుంబసభ్యులు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధికి సోమవారం ఉదయం భార్య అశ్విని, కూతుర్లు వందితా, ధృతి, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఇతర కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పూజలు చేశారు. పునీత్‌కు ఇష్టమైన 30 రకాల శాకాహార, మాంసాహార వంటకాలను సమాధి వద్ద ఉంచారు. సదాశివనగరలోని పునీత్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వేలాదిమందికి అన్నదానం చేశారు.

About Author