PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోనూసూద్ కీల‌క రాజకీయ ప్రక‌ట‌న !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ న‌టుడు సోనూసూద్ కీల‌క‌మైన ప్రక‌ట‌న చేశారు. సోనూసూద్ త్వర‌లో రాజ‌కీయ రంగ‌ప్రవేశం చేస్తార‌న్న వార్తలు చ‌క్కెర్లు కొడుతున్న వేళ‌… త‌న సోద‌రి మ‌ళ‌విక సూద్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేస్తారంటూ కీల‌క ప్రక‌ట‌న చేశారు. అయితే ఏ పార్టీలో చేర‌తార‌న్న విష‌యం ఇంకా ప్రక‌టించ‌లేదు. మాళ‌విక పోటీకి సిద్ధమైంద‌ని, ప్రజాసేవ చేయాలన్న ఆమె నిబ‌ద్ధత సాటిలేనిద‌ని అన్నారు. ఆమె ఏ పార్టీలో చేరేది త్వర‌లో స్పష్టం చేస్తాన‌ని చెప్పారు. మాళ‌విక సూద్ ఇటీవ‌ల పంజాబ్ ముఖ్యమంత్రిని క‌లిశారు. మ‌రోవైపు సోనూసూద్ ఢిల్లీ ప్రభుత్వం త‌ర‌పున దేశ్ కా మెంటార్ ప్రోగ్రాంకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు. అయితే.. కాంగ్రెస్, ఆప్ ల‌లో ఏ పార్టీలో చేర‌తార‌న్న విష‌యం పై స్పష్టత లేదు.

About Author