PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నిక‌ల వేళ‌.. బ‌యోపిక్ తో హీటెక్కిన రాజ‌కీయం

1 min read

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు త్వర‌లో జ‌రుగుతున్నాయి. ఒక‌వైపు ఎన్నిక‌ల వేడి .. మ‌రోవైపు వేస‌వి కాలం ఉక్కతో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు త‌మిళ తంబిలు. ఈ రెండింటి మ‌ధ్యలో మ‌రో సినిమా ట్రైల‌ర్ త‌మిళ రాజ‌కీయాల‌ను హీటెక్కించింది. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘త‌లైవి’. ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. ట్రైల‌ర్ లో డైలాగ్ లు రాజ‌కీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నిక‌ల వ్యూహ‌, ప్రతి వ్యూహాలు… విమ‌ర్శలు, ప్రతి విమ‌ర్శల‌తో ద‌ద్దరిల్లుతున్న త‌మిళ రాజ‌కీయ య‌వ‌నిక‌.. ఈ తాజా ‘త‌లైవి’ ట్రైల‌ర్ తో మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. కంగ‌నా ర‌నౌత్ ఈ చిత్రంలో జ‌య‌ల‌లిత పాత్ర పోషించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా అంచ‌నాల‌ను కూడ పెంచుతోంది. ‘‘ మ‌హాభార‌తంలో కూడ ద్రౌప‌దికి ఇదే జ‌రిగింది. త‌న చీర లాగి అవమాన‌ప‌రిచిన కౌర‌వుల క‌థ ముగించి.. జ‌డ ముడేసుకుని త‌న శ‌ప‌థాన్ని నెర‌వేర్చుకుంది. ఆ మ‌హాభార‌తానికి మరో పేరుంది… జ‌య‌.’’ అంటూ సాగే డైలాగ్ త‌మిళ‌నాట సినిమా అంచనాల‌ను పెంచేసింది.

About Author