అత్యాచారం అనివార్యమైతే.. దానిని ఆనందంగా ఆస్వాదించాలి !
1 min read
17/12/2021
పల్లెవెలుగువెబ్ : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్ణాటక అసెంబ్లీలో చర్చ పొడిగించాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. స్పీకర్ వారిని అదుపు చేయలేక.. `` నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే అన్నింటినీ ఆస్వాదిస్తూ అవును.. అవును.. అంటూ ఉండాలి `` అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో రమేష్ కుమార్ స్పందిస్తూ అత్యాచారం అనివార్యం అయినప్పుడు ఆనందంగా ఆస్వాదించాలి అనే సామెత ఉందని, తమరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని స్పీకర్ ను ఉద్దేశించి అన్నారు.