PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్ల‌లు పుట్ట‌ర‌ని వ్యాక్సిన్ వేయించుకోవ‌డం లేద‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్ర‌పంచ దేశాల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. బ్రిటన్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇప్పటికే వీకెండ్‌ మ్యాచ్‌లను వాయిదా వేశారు. మరోవైపు ఆటగాళ్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహకులకు తలనొప్పిగా మారింది. రెండు డోసుల వ్యాక్సిన్‌, అలాగే బూస్టర్‌ డోస్‌ వేయించుకునేందుకు ఆటగాళ్లు ససేమిరా అంటున్నట్లు నిర్వహకులు తెలిపారు. వ్యాక్సిన్‌ నిరాకరణకు ఆటగాళ్లు చెబుతున్న కారణాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయని వారంటున్నారు. మెజారిటి శాతం వ్యాక్సిన్‌పై నమ్మకం లేదని చెబుతుండగా, శాకాహారులకు టీకా అవసరం లేదని కొందరు, సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయని మరికొందరు వ్యాక్సిన్‌ను నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు పుట్టరనే భయంతో కొందరు ఆటగాళ్లు వ్యాక్సిన్‌ వేయించుకోవట్లేదని, ఈ నిరాధారమైన అపోహని వారు గుడ్డిగా నమ్ముతున్నారని లీగ్‌ నిర్వహకులు తెలిపారు.

                                 
                    

About Author