PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా పై ఎందుకంత ద్వేషం : సిద్ధార్థ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై ఇటీవ‌ల అస‌హనం వ్య‌క్తం చేసిన న‌టుడు సిద్ధార్థ్. మ‌రోసారి త‌న‌దైన శైలిలో స్పందించారు. ఆడియన్స్‌ని అలరించేది ఏదైనా ఎంటర్‌టైన్‌మెంటే అయినప్పుడు క్రికెటర్ల జీతాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నాడు. సినీ పరిశ్రమపైనే ఎందుకంత ద్వేషమని ప్రశ్నించాడు. ‘‘ధరలు తగ్గించే ఉద్దేశంతో స్టార్‌ హోటల్స్‌ నిర్మించాలనుకునేవారికి లాడ్జీల నిర్మించడానికే పర్మిషన్లు ఇస్తారా? . బయట క్యాంటీన్లలో దొరికే ధరలకే అక్కడి ఆహారాన్ని అందించాలని చెబుతారా? . భూముల ధరలను ఎందుకు నియంత్రించడం లేదు? . క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలను ఎందుకు తగ్గించడం లేదు?. నటుల పారితోషికాన్ని ప్రశ్నించినప్పుడు ఒక క్రికెటర్‌ జీతాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? క్రికెటర్లలో ప్రతిభ ఉంటే నటీనటులకు ఏముంది? ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడైనా ఎంటర్‌టైన్‌మెంటే..! సినిమాపైనే మీరు ఎందుకు ద్వేషం చూపిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.

                               

About Author