PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌క్స‌లైట్ గా ఆర్జీవీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నక్స‌లైట్ అవ‌తార‌మెత్తారు. వ‌రంగ‌ల్ కు చెందిన కాంగ్రెస్ నేత కొండా ముర‌ళి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం కొండా. ఈ చిత్రానికి ఆర్జీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొండా మూవీ షూటింగ్ పూర్తీ అయింది. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ లోని కొండా ముర‌ళి గెస్ట్ హౌస్ లో ముగింపు వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కొండా ముర‌ళి, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుకలో నక్సలైట్‌ గెటప్‌లో వచ్చిన ఆర్జీవీ.. పెద్ద తల్వార్‌తో కేకును ముక్కలు ముక్కలుగా కోశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. కిల్లింగ్‌ ఏ కేక్‌ ఫర్‌ కొండా అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

                                       

About Author