ఆర్ఎస్ఎస్ చీఫ్ తో విజయసాయిరెడ్డి భేటీ !
1 min read

పల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటన అనంతరం నర్సాపురం రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మోహన్ భగవత్ ను విజయసాయిరెడ్డి కలిశారు. ఈ సమయంలో రాజమండ్రి నుంచి నరసాపురం వస్తున్న విజయసాయిరెడ్డి పాలకొల్లు రోడ్డులో పోలీస్ బందోబస్తు చూసి భగవత్ సమాచారాన్ని తెలుసుకున్నారు. వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి రిజర్వేషన్ బోగీలో ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిశారు. రెండు నిమిషాలు ఆయనతో మాట్లాడి, ఫొటోలు దిగి రైలు నుంచి దిగిపోయారు. ‘‘నర్సాపురంలో ఆర్‌ఎ్‌సఎస్ సర్ సంఘ్చలాక్ మోహన్ భగవత్‌ను కలవడం గౌరవంగా ఉంది. ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి, మార్గనిర్దేశం పొందేందుకు అద్భుతమైన అవకాశం లభించింది’’ అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

