వరుస లాభాల్లో సూచీలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుస లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి భయాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో.. దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం కొద్దిసేపు ఊగిసలాటకు గురైన సూచీలు అనంతరం లాభాలతో కొనసాగుతున్నాయి. యూరప్ మార్కెట్లు కూడ పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. 2 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 59450 వద్ద, నిప్టీ 62 పాయింట్ల లాభంతో 17688 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో 36575 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.