PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా హీరోగా గాలిజనార్థ‌న్ రెడ్డి త‌న‌యుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ వ్యాపారవేత్త‌, మాజీ మంత్రి గాలి జ‌నార్థ‌న్ రెడ్డి త‌న‌యుడు కిరిటీ రెడ్డి తెరంగేట్రం చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. తెలుగు నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మాతగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌స్తుత‌తం కిరీటి డ్యాన్స్, యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఈ విష‌యాన్ని స్వయంగా ద‌ర్శ‌కుడే వెల్ల‌డించారు. దివ‌గంత క‌న్న‌డ న‌టుడు పునీత్ రాజ్ కుమార్ స్పూర్తితో సినిమాల్లోకి వ‌స్తున్న‌ట్టు రాధాకృష్ణ తెలిపారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా ఏక‌కాలంలో రూపుదిద్దుకోనుంది.

                                               

About Author