PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా వాళ్లంటే.. చీప్ అయ్యారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినీ ప‌రిశ్ర‌మ పై ఇటీవ‌ల ఏపీలోని కొంత మంది నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల పై ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు. సినీ ప‌రిశ్ర‌మ‌ను నిందిస్తున్న నాయ‌కులు త‌లదించుకోవాల‌ని, కుల ప్ర‌స్తావ‌న లేకుండా అంద‌రికీ అన్నం పెట్టేది సినీ ప‌రిశ్ర‌మ మాత్ర‌మేన‌ని అన్నారు. సినిమా విష‌యంలో కుల‌, మ‌తాల ప్ర‌స్తావ‌న ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఒక కులం వారు ఓట్లు వేస్తేనే గెల‌వ‌లేద‌ని, ప్ర‌జ‌లంతా ఓటు వేస్తేనే అధికారంలోకి వ‌చ్చామ‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాల‌ని అన్నారు. సినిమా వాళ్లు చీప్ గా దొరికార‌ని ఇష్టం వచ్చిన‌ట్టు మాట్లాడుతారా ? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సామాజిక వ‌ర్గాల పేరుతో ఎందుకు రాద్దాంతం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తెంత‌.. వ‌చ్చాక ఎంతో చ‌ర్చ‌ద్దామా అని స‌వాల్ విసిరారు.

                                            

About Author