ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఎస్బీఐ శుభవార్త
1 min readపల్లెవెలుగువెబ్ : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్ పై అందించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. 1 సంవత్సరం కాలపరిమితి నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి గల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.0% నుంచి 5.1%కి పెంచింది. అలాగే, అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటును 5.50% నుంచి 5.60%కి పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి.