లతా మంగేష్కర్ ఆరోగ్యం.. తాజా అప్ డేట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయని, ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ కరోన బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు . లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.