ప్రాణ రక్షణ కోసం ఢిల్లీకి వచ్చా : రఘురామకృష్ణరాజు
1 min readపల్లెవెలుగువెబ్ : తనను మర్డర్ చేస్తారనే ప్లాన్ విషయం తెలిసే.. ప్రాణ రక్షణ కోసం ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వచ్చానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వివేకా హత్య తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారని విజయసాయి ప్రకటించారని, తర్వాత గొడ్డలి పోటుతో మరణించారని తెలిసిన తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపించారని అన్నారు. అసలు వివేకను ఎవరు చంపారో అందరికీ తెలుసునని.. చివరికి సీబీఐ విచారణలో వైసీపీ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఏదీ ఏమైనప్పటికీ గొడ్డలి పోటును.. గుండె పోటని ఎందుకు చెప్పావ్?.. ఎవరు చెప్పమన్నారని విజయసాయికి రఘురామ సుటిగా ప్రశ్నించారు. ఎవరిని కాపాడ్డానికి ఈ ఘటనను టీడీపీపైకి నెట్టారని నిలదీశారు.