ఊరికొక వైసీపీ బూచోళ్లు ఉన్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ నేతల పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో యథా లీడర్ తథా కేడర్ అన్నట్లుగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాధనం 43 వేల కోట్ల దోపిడీ కేసులో జగన్ ఏ-1 అయితే ఎంపీ మోపిదేవి ఏ-7 అని ఆయన పేర్కొన్నారు. పాలకులే నేరగాళ్లయితే వాళ్ల అనుచరులు పాల్పడే ఘోరాలకు అంతులేదని మోపిదేవి వెంకటరమణ రైట్‌హ్యాండ్ భూశంకర్ నిరూపించాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన భూశంకర్ లాంటి వైసీపీ బూచోళ్లు రాష్ట్రంలో ఊరికొకడున్నాడని ఆయన అన్నారు.