PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ తో అమ్మాయిలు జాగ్రత్త…!

1 min read

కేర‌ళ‌: రాహుల్ గాంధీ తో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటూ కేర‌ళ‌కు చెందిన మాజీ ఎంపీ జోయిస్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇడుక్కిలో ఎల్డీఎఫ్ కు మ‌ద్దతుగా ప్రచారం నిర్వహించిన జోయిస్ జార్ట్.. రాహుల్ గాంధీకి పెళ్లి కాలేద‌ని, అత‌నితో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. జోయిస్ జార్జ్ వ్యాఖ్యల‌కు నిర‌స‌న‌గా రాష్ట్రమంతా ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుట్టనుంది. ఒక రాజ‌కీయ నాయకుడు ఇలా ఆలోచించ‌డం దారుణం అంటూ కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. అయితే.. జోయిస్ జార్జ్ రాహుల్ ను విమ‌ర్శించే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశార‌ని, దురుద్దేశంతో కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ వివాదానికి కార‌ణం ఇటీవ‌ల కేర‌ళ‌లో ప‌ర్యటించిన రాహుల్ గాంధీ.. కొచ్చిలోని సెయింట్ థెరిస్సా కాలేజీలో అమ్మాయిల‌కు ‘ఐకిడో’ అనే మార్షల్ ఆర్ట్ విద్య మెళ‌కువ‌లు నేర్పించారు. జ‌పాన్ కు చెందిన ‘ఐకిడో’ విద్యను ఆత్మర‌క్షణ కోసం నేర్చుకుంటారు.

About Author