PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : జగన్‌ పాలనలో మహిళా భద్రత గాల్లో దీపమేనని టీడీపీ నేత అనిత అన్నారు. నెల్లూరులో మహిళా పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు దారుణమన్నారు. మహిళా పోలీసులకు మగ టైలర్‌తో కొలతలు తీయించడం సరికాదన్నారు. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా?, పోలీస్ వృత్తిలో ఉన్న మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు. దీనిపై సీఎం, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మాభిమాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

        

About Author