భగ్గుమన్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. కాగా ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో పి.డి.యస్.యూ, యస్.ఎఫ్.ఐ, టి.యన్.యస్.ఎఫ్, తెలుగునాడు, డి.వై.ఏఫ్.ఐ, విద్యార్ది సంఘాలు ధర్నా చేశాయి. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు బయలుదేరారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ… మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ హామీలు మాటలకే పరిమితం అయ్యాయన్నారు. ప్రతీయేడాది జాబ్ క్యాలెండర్ అన్న సీఎం.. ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించారు.