విశాఖలో ట్రాఫిక్ జాం పై .. సీఎం సీరియస్
1 min read
పల్లెవెలుగువెబ్ : విశాఖపట్నంలో సీఎం జగన్ బుధవారం పర్యటించారు. శ్రీ శారదా పీఠం సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని పై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆయన స్పష్టం చేశారు.