వైసీపీ కౌన్సిలర్ ఇంట్లో సీబీఐ సోదాలు
1 min readపల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా హిందూపురం 21వ వార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ మారుతీరెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు నేపథ్యంలో సీబీఐ బెంగళూరు శాఖకు చెందిన డీఎస్పీ ప్రదీప్ కుల్ దీప్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. మొత్తం ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరెడ్డిని కూడ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.