ఉద్యోగ ఖాళీల పై స్పష్టత ఇవ్వాలి
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అధికారుల ప్రాథమిక గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు తెలిసిందన్నారు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల్లో 8.72 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో మరో 6.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవ ఖాళీల సంఖ్యను బహిర్గతం చేసి వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమర్శించారు.