నైట్ కర్ఫ్యూ ఎత్తివేత !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫీవర్ సర్వేను కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది.