ఏపీ వైద్యవిధాన పరిషత్ లో పోస్టుల భర్తీకి అనుమతి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ వైద్య విధాన పరిషత్ లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఖాళీగా ఉన్న 2,588 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సర్జన్, అసిస్టెంట్ సర్జన్లు 446 మందిని తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశించారు. పలువురు సిబ్బందిని ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.