PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు విశాఖలోని ముఖ్యకూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ‘దేశానికి అవసరమైన జనహృదయనేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, గురుద్వార, స్పెన్సర్స్‌, సిరిపురం జంక్షన్లలో గురువారం ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎవరు ఏర్పాటుచేశారనేది మాత్రం ఫ్లెక్సీలో ఎక్కడా కనిపించకపోవడం విశేషం.

                                     

About Author