PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందీ వారికి ఒక న్యాయం.. తెలుగువారికి ఒక న్యాయమా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విద్య ఉద్యోగ పరీక్షలు హిందీ ఇంగ్లీష్ లో నిర్వహించే హిందీ వారికి ఒక న్యాయం తెలుగువారి ఒక న్యాయం చేయడం సరైంది కాదని తెలుగులో నిర్వహించి తీరాలని ప్రముఖ వైద్యులు సామాజిక వేత్త డాక్టర్ సి. ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు . ప్రపంచ అమ్మనుడి పండగ రోజు సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో సదస్సు ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంగా సురేష్ అధ్యక్షతన యోగివేమ‌న యూనివ‌ర్శిటీలో జరిగింది. సదస్సులో ముఖ్యఅతిధిగా హాజరైన ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం అని అనేక భాషలు మతాలు కులాలు జాతులు ఉన్నాయని భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అని అయితే అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత సమాఖ్య ప్రభుత్వానికి ఉందని భాషా వివక్ష చూపటం సరైనది కాదని వారు పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ పరీక్షలు యూపీఎస్సీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఆర్బీఐ , డిఫెన్స్ , నెట్, తదితర పరీక్షలు హిందీ లో నిర్వహించి తెలుగులో నిర్వహించకపోవడం తెలుగు వారికి తీవ్రమైన అన్యాయం చేయడమే అని అన్నారు . ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి.. పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు ఇచ్చి జరగబోయే పార్లమెంటు సమావేశంలో ఈ అంశం పై మాట్లాడే విధంగా ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఏఐవైఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గంగా సురేష్ , డిప్యూటీ సెక్రటరీ దస్తగిరి , ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి జి. వల రాజు , అధ్యక్షులు పవన్ , టి లవకుమర్, డి శివ , జ్యోతి, శరత్, వెంకటేష్ , కిరణ్, శీను ,ఆమోస్, భరత్ , సంజీవ్, లీల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author