NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కుట్ర‌.. నిందితులు అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందని, పోలీసులు దాన్ని చాకచక్యంగా భగ్నం చేశారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. కుట్రతో ఎనిమిది మంది నిందితులకు సంబంధం ఉందని.. ఢిల్లీలో, హైదరాబాద్‌లో కలిపి ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. శ్రీనివా్‌సగౌడ్‌ను హత్య చేయడానికి ఫరూక్‌ అనే వ్యక్తికి రూ.15 కోట్లు సుపారీ ఇచ్చినట్లు చెప్పారు. ఆ డబ్బు ఇవ్వడానికి మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు ముందుకొచ్చినట్లు విచారణలో తేలింది. అయితే మంత్రి హత్యకు ప్లాన్‌ చేసిన విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచాలని ఫరూక్‌కు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చామని, కానీ ఫరూక్‌ తన స్నేహితుడు హైదరాలీకి విషయం చెప్పి తనను వెంటేసుకొని తిరుగుతుండటంతో సుపారీ ఇచ్చిన నలుగురికి అనుమానం వచ్చిందని నిందితులు తెలిపారు. 2018 ఎన్నికలకు ముందు మహబూబ్‌నగర్‌లో శ్రీనివా్‌సగౌడ్‌ ఇంటి సమీపంలో ఒక కౌన్సిలర్‌పై జరిగిన హత్యాయత్నం నుంచి రాఘవేందర్‌రాజుకు, శ్రీనివా్‌సగౌడ్‌ శిబిరానికి మధ్య విబేధాలు మొదలయ్యాయని అంటున్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో శ్రీనివా్‌సగౌడ్‌ అఫడవిట్‌ని ట్యాంపరింగ్‌ చేశారంటూ రాఘవేందర్‌రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

                                      

About Author