జ్యోతిరావ్ పూలే పై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్ : మహాత్మ జ్యోతిరావ్ పూలే దంపతులపై మహరాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావ్ పూలే దంపతులు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారంటూ గవర్నర్ భగత్ సింగ్ వ్యాఖ్యానించారు. దీని పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో భగత్ సింగ్ కోషియారీ మాట్లాడుతూ, పదేళ్ళ వయసున్న సావిత్రి బాయ్‌ని 13 ఏళ్ల వయసులో జ్యోతిబా ఫూలే పెళ్లి చేసుకున్నారని, ఆ చిన్నతనంలో వారు ఏం చేయగలరని, పెళ్లి జరుగుతున్నపుడు వారు ఏం ఆలోచించగలరని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనను తక్షణమే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో బాల్యంలోనే పెళ్లి చేసుకోవడం ఆచారమని, ఇటువంటి అసహ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఫూలేను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు.