రోడ్డుకు అడ్డంగా భారీ కొండచిలువ.. ఎక్కడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మంగంపల్లి-ఉప్పొంక గ్రామల మధ్యలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవ్వడంతో స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డు దాటుతున్న కొండ చిలువను ఓ లాయర్ సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొండ చిలువ సంఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.