PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. యుద్ధ విర‌మ‌ణ‌కు సిద్ధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌పై గత 12 రోజులుగా విరుచుకుపడుతున్న రష్యా నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను నిలిపివేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, అందుకు కొన్ని షరతులు కూడా విధించింది. యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రపంచదేశాలన్నీ ఏకమై మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టిన రష్యా తన దాడిని కొనసాగిస్తూ ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆర్థిక ఆంక్షలకు సైతం లెక్క చేయకుండా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి నేడు ఈ కీలక ప్రకటన వెలువడింది.

                         

About Author