PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలేసిన గ్రామం.. రెండు నెల‌లుగా ప‌స్తులుంటున్న కుటుంబం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పొలాన్ని గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వలేదని ఓ గిరిజన కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు వెలివేశారు. ఆ కుంబానికి గ్రామంలో ఎవరూ సహాయం చేయవద్దని ఆదేశించారు. ఎలాంటి సహకారం చేయొద్దని, పాలు, సరుకులు ఇవ్వకూడదని హుకూం జారీ చేశారు. దీంతో ఆ కుటుంబం రెండు నెల‌లుగా ప‌స్తులుంటోంది. ఆ కుటుంబం జిల్లా కలెక్టరుకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జీలుగుమిల్లి పంచాయితీ ,చంద్రమ్మ కాలనీకి చెందిన శ్రీరాములు కుటుంబాన్ని ఆ గ్రామం వెలివేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన బి పట్టా భూమిలో రాములు కుటుంబం 16 ఏళ్లుగా పామాయిల్ సాగు చేసుకుంటోంది. ఆ భూమిని ఎవరికీ కౌవులుకు ఇవ్వరాదని నిబంధన ఉన్నా.. గ్రామస్తులంతా కలిసి భూమిని గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వాలని చెప్పారు. అందుకు నిరాకరించడంతో ఆ కుటుంబంపై గ్రామ పెద్దలు కక్ష్యకట్టి కులం నుంచి సామాజికంగా బహిష్కరించారు. ఆ కుటుంబాన్ని ఎవరూ కూలి పనికి కూడా పిలవద్దని ఆదేశించారు.

                                   

About Author