PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నమాచుపల్లిలో..యువకుడి ఆత్మహత్య

1 min read

పల్లె వెలుగు, చెన్నూరు:మండలంలోని చిన్న మాచు పల్లి గ్రామంలో బుధవారం ఉదయం మాలే లా గంగాధర్ (20)  తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చినమాచూపల్లె గ్రామానికి చెందిన మృతుడు గంగాధర్ ఓ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు అన్నారు. మృతుడు గంగాధర్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడే వారని, అతనికి అతని తల్లిదండ్రులు చికిత్స కూడా చేయించేవారని తెలిపారు. కాగా గంగాధర్ బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు, కాగా ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Author