PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరంజీవి `గాడ్ ఫాద‌ర్` లో స‌ల్మాన్ ఖాన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు’ అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు చిరు.

                                        

About Author