ఆ సినిమా కోసం ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : అస్సాం ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఓ సినిమా చూసేందుకు ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ది కశ్మీర్ ఫైల్స్
సినిమా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు పై అధికారికి సినిమా టికెట్ చూపించి, లీవ్ అప్లై చేస్తే హాప్‌డే లీవ్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక సినిమా కోసం ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం.