16 నుంచి సూర్యనారాయణ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాలు
1 min readపల్లెవెలుగు, కర్నూలు;
రాయలసీమ ముఖద్వారమైన కందనవోలు నడిబొడ్డున నిర్మితమైన సూర్యనారాయణ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు, రథసప్తమి వేడుకలను ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు చైర్మన్ రామకృష్ణ తెలిపారు. శనివారం ఉదయం దేవాలయ ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 19న శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ చేతుల మీదుగా సూర్య నారాయణ స్వామి మూలవిరాట్టుకు అభిషేకం, 20న సూర్య నారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నామన్నారు. రథసప్తమి, ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
కర్నూలులోని సూర్యదేవాలయం