కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత: ప్రేమ వ్యవహారమే కారణం
1 min readపల్లె వెలుగు వెబ్: కళ్యాణదుర్గం పట్టణంలో ఓ ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు పెట్రోల్ పోసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. కళ్యాణదుర్గం పట్టణంలోని ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లికూడ చేసుకున్నారు. ఇరుకుటుంబాలు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో ఇరుకుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ రెండు కుటుంబాలకు ఆయా సామాజిక వర్గాలు మద్దతు తెలిపాయి. దీంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. దీంతో వివాదం మరింతగా ముదిరింది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. తమ మీద దాడి చేసిన వారి మీద పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిరసన తెలిపారు. దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని సీఐ శివశంకర్ నాయక్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.