PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ సినిమా పై సౌదీ అరేబియా నిషేధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘డాక్టర్ స్ట్రైంజ్: మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. దానికి కారణం.. బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ‘అమెరికా ఛావెజ్’ అనే క్యారెక్టర్ ఉంది. జోచిటిల్ గోమెజ్ నటించిన ఈ పాత్ర ‘గే’ క్యారెక్టర్ కావడంతో సౌదీ ఫిల్మ్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్‌ని జారీ చేయలేదు. సౌదీతో పాటు మరికొన్ని గల్ఫ్ దేశాలు కూడా ఇదే కారణంగా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. అయితే.. ఈ దేశం గతంలో ‘గే’ పాత్రలు ఉన్నాయని మార్వెల్ మూవీ ‘ది ఎటర్నెల్స్‌’పై సైతం నిషేధం విధించింది.

                                                   

About Author