జమ్మూకశ్మీర్.. మోదీ సభ సమీపంలో పేలుడు
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ-కశ్మీరు పర్యటన ఆదివారం ప్రారంభమైంది. అయితే జమ్మూ జిల్లాలో ఆయన పాల్గొనబోతున్న బహిరంగ సభా ప్రాంగణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లలియానా గ్రామంలోని ఓ పొలంలో భారీ పేలుడు సంభవించింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పేలుడు స్వభావంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఉగ్రవాద సంబంధిత పేలుడుగా కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇది ఉల్క అయి ఉండవచ్చునని తెలిపారు. ఇదిలావుండగా, మోదీ పర్యటన సందర్భంగా జమ్మూ-కశ్మీరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.