పవన్ గురించి రేణుదేశాయ్ ని అడిగితే తెలుస్తుంది !
1 min read
పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమరనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‘ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు… రాజకీయ జీవితంలో కూడా విలువల్లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది’’ అని మంత్రి అమరనాథ్ విమర్శించారు. ‘‘పవన్ కల్యాణ్ ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది మేం చెప్పడం కంటే ఆయన రెండో మాజీ భార్య రేణుదేశాయ్‌ని అడిగితే తెలుస్తుంది. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కల్యాణ్‌కు లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు నిలకడలేదు“ అని అన్నారు.