PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫెడ్ దెబ్బ‌కు.. కుదేలైన స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమ‌వారం భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. యూస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ సూచీలు బలహీనంగా కదలాడాయి. వాటి ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఈ రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఐటీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి 16,953 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.

                                           

About Author