PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేవైసీ చేసుకుంటేనే.. పీఎంకేఎస్వై నగ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా పది విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నగదు జమకానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

                                         

About Author