కర్నూలు.. డీసీసీ అధ్యక్షుడు రాజీనామా !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు డీసీసీ అధ్యక్ష పదవికి అహ్మద్ అలీ ఖాన్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… డీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే డిసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. లోకల్ ఎలక్షన్స్‌లో తనకు పార్టీ సపోర్ట్ చేయలేదని కాంగ్రెస్ నేత అహ్మద్ అలీ ఖాన్ అన్నారు.